తెలంగాణ

telangana

ETV Bharat / sports

' కెప్టెన్​గా ఎఫర్ట్​ పెడుతాను - వాళ్లు అలా చేయకపోతే ఏ జట్టుకైనా గెలవడం కష్టమే' - Babar Azam About Pakistan Team

Babar Azam World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో భాగంగా కోల్​కతా వేదికగా జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో అధికారికంగా సెమీస్​ రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఓటమిపై మ్యాచ్​ తర్వాత పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ స్పందించాడు. ఇంతకీ అతను ఏమన్నాడంటే..

Babar Azam World Cup 2023
Babar Azam World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 9:37 AM IST

Babar Azam World Cup 2023 :ఈ ఏడాది వన్డే ప్రపంచకప్​ను పాకిస్థాన్​ జట్టు ఘోర పరాజయంతో ముగించింది. కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో సెమీస్‌ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. అయితే ఇప్పటి వరకు టోర్నీలో పాక్​.. ఆడిన 9 మ్యాచుల్లో నాలుగు మాత్రమే గెలిచింది. అయిదింటిలో ఓటమిని చవి చూసింది. ఇలా ప్రపంచకప్‌ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్‌ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో ఇంగ్లాండ్​తో ఓటమిపై మ్యాచ్‌ తర్వాత పాకిస్థాన్​ కెప్టెన్‌ బాబర్‌ అజామ్​ స్పందించాడు.

"ఈ మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో మా జట్టు గెలిచినట్లయితే.. పరిస్థితి మరోలా ఉండేది. బౌలింగ్‌, ‍బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో ఎన్నో తప్పిదాలు చేశాం. 20-30 పరుగులు అదనంగానే ఇచ్చాం. మా స్పిన్నర్లు అస్సలు వికెట్లు తీయలేదు. అది మాపై చాలా ప్రభావాన్ని చూపింది. మిడిల్ ఓవర్‌లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ టోర్నీలో మేము చేసిన తప్పిదాలను కచ్చితంగా చర్చిస్తాం. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. జట్టుకు సారథిగా ఎల్లప్పుడూ 100 శాతం ఎఫర్ట్​ పెడతాను" అని బాబర్​ పేర్కొన్నాడు.

మ్యాచ్​ తర్వాత రిటైర్మెంట్​..
Babar Azam Retirement : ప్రపంచ కప్‌లో అంచనాలు అందుకోలేకపోవడం, పేలవమైన ప్రదర్శన వల్ల బాబర్ అజామ్ ప్రస్తుతం​ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీ నుంచి అతను దిగిపోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ తర్వాత బాబర్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ తర్వాత బాబర్​.. వైట్ బాల్ జట్టు కెప్టెన్సీకి దూరం కానున్నట్లు సమాచారం. అయితే పాక్​కు తిరిగి వెళ్లిన తర్వాత పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్​ రజాతో కలిసి.. ఆ తర్వాత బాబర్​ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని తెలుస్తోంది. వారి నుంచి వచ్చే సూచనల మేరకు కెప్టెన్​గా కొనసాగాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం.

పాకిస్థాన్​పై ఇంగ్లాండ్ ఘన విజయం - చెలరేగిన స్టోక్స్ , విల్లే

కెప్టెన్సీకి బాబర్​ అజామ్​ గుడ్​ బై- ఇంగ్లాండ్​తో మ్యాచ్​ తర్వాతే!

ABOUT THE AUTHOR

...view details