పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అరుదైన ఘనతను అందుకున్నాడు. పాక్ క్రికెట్‌కు తాను అందించిన విశిష్ట సేవలకు గానూ.. తమ దేశంలోని మూడొవ అత్యున్నత పౌర పురస్కారం సితార ఎ ఇమ్తియాజ్‌ను అందుకున్నాడు. ఈ అవార్డును సాధించిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. అతడి వయసు ప్రస్తుతం 28ఏళ్లు. పాకిస్థాన్ డే వేడుకల్లో భాగంగా పంజాబ్ గవర్నర్ హౌస్‌లో.. గవర్నర్ బలిఘ్ ఉర్ రెహ్మాన్.. బాబర్‌కు ఈ పురస్కారాన్ని అందజేశారు. తన తల్లిదండ్రుల సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకోవడం.. ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు బాబర్ పేర్కొన్నాడు. "ఈ అవార్డు నా తల్లిదండ్రులు, అభిమానులు, పాకిస్థాన్ ప్రజలకు అంకితం" అని సోషల్‌మీడియాలో ట్వీట్ చేశాడు. కాగా, అంతకుముందు గతంలో పాక్ క్రికెటర్లైన మిస్బా ఉల్ హక్, యూనిస్ ఖాన్, షాహిద్ అఫ్రిది.. ఈ సితార ఎ ఇమ్తియాజ్ పురస్కారాన్ని అందుకున్నారు.
బాబర్ కెరీర్ విషయానికొస్తే.. 2015 మేలో జింబాబ్వేపై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2016లో టీ20లు, టెస్టు ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. 47 టెస్టుల్లో 48.63 సగటుతో 3,696 పరుగులు చేయగా.. 95 వన్డేల్లో 59.41 సగటుతో 4,813 పరుగులు చేశాడు. ఇక 99 టీ20ల్లో 41.41 సగటుతో 3,355 రన్స్ సాధించాడు.
బాబార్.. తన అసాధారణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలతో.. పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాక.. ఆ దేశ క్రికెట్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. టీమ్ సభ్యులందరితో పాటు యంగ్ క్రికెటర్స్‌కు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. 2022 ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2022 ఐసీసీ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్(వన్డే జట్టుకు) వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. అతడి సారథ్యంలో.. పాకిస్థాన్.. వరల్డ్ కప్ మ్యాచ్‌లో మొదటిసారిగా భారత్‌ను ఓడించింది. చివరి టీ20 ప్రపంచ కప్‌లోనూ ఫైనల్‌కు చేరుకుంది.
ఇకపోతే రీసెంట్గా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకంటే అతడు వరల్డ్‌లోనే రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జాల్మీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్లో.. నచ్చిన లీగ్ ఒకటి చెప్పమని అడగగా.. అతడు బిగ్‌బాష్ లీగ్ అంటూ బదులిచ్చాడు. దీంతో అతడి సమాధానంపై క్రికెట్ ఫ్యాన్స్ బాగా ఫైర్ అయ్యారు. తీరు మార్చుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:గ్రాండ్‌గా IPL ప్రారంభోత్సవ వేడుక.. రష్మిక, తమన్నా డ్యాన్స్ షో!