తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 8:46 PM IST

ETV Bharat / sports

కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్ అజామ్!

పాకిస్థాన్​ కెప్టెన్ బాబర్ అజామ్ మరో ఫీట్​ను సాధించాడు. టీ20ల్లో వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ ఘనత టీమ్​ఇండియా సారథి కోహ్లీ పేరిట ఉండేది.

Babar Azam breaks Kohli's record, becomes fastest to score 2k runs in T20Is
బాబర్ అజామ్​, కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన బాబర్

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్​ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్​లో అత్యంత వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త ఫీట్​ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీని అధిగమించాడు అజామ్.

హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న చివరి టీ20లో.. అజామ్ ఈ ఫీట్​ సాధించాడు. భారత సారథి కోహ్లీ 56 ఇన్నింగ్స్​ల్లో ఈ ఘనత సాధించగా.. బాబర్​ కేవలం 52 ఇన్నింగ్స్​ల్లోనే ఈ రికార్డును అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(62 ఇన్నింగ్స్​ల్లో), కివీస్ మాజీ సారథి మెక్​ కల్లమ్​(66 ఇన్నింగ్స్​ల్లో) ఉన్నారు.

కోహ్లీ 52.65 సగటుతో టీ20ల్లో 3,159 రన్స్​తో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. బాబర్​ 2,035 రన్స్​తో 11వ స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి:'శుభ్​మన్ ఆ జాబితాలో తప్పక ఉంటాడు'

ఇదీ చదవండి:జడేజా ఆల్​రౌండ్ షో.. చెన్నై సూపర్​ విక్టరీ

ABOUT THE AUTHOR

...view details