టీ20 ప్రపంచకప్‌ను(T20 World Cup 2021) ఆస్ట్రేలియా విజయంతో ప్రారంభించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై(AUS vs SA t20 world cup) ఆసీస్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో 121 పరుగులు చేసి గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (35) రాణించగా.. డేవిడ్ వార్నర్ 14, మ్యాక్స్‌వెల్ 18, మార్ష్ 11 పరుగులు చేశారు. ఆరోన్ ఫించ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 38 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన ఆసీస్‌ను స్మిత్-మ్యాక్స్‌వెల్ భాగస్వామ్యం ఆదుకుంది. వీరిద్దరూ కలిసి 42 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో స్మిత్‌తోపాటు మ్యాక్సీ ఔట్ కావడంతో ఆసీస్ శిబిరంలో కాస్త కలవరం రేగింది. అయితే దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టం చేసినా మార్కస్ స్టొయినిస్ (24*), మ్యాథ్యూ వేడ్ (15*) ఏమాత్రం పట్టు విడవకుండా ఆసీస్‌ను విజయ తీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో నార్జే 2.. రబాడ, మహరాజ్, షంసి తలో వికెట్ తీశారు.
రాణించిన మర్క్రమ్