తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఒక్క బాల్​లో 5 పరుగులు - పాక్ ఫీల్డింగ్​ అంటే అంతే మరి!

Australia Vs Pakistan Test : ఆస్ట్రేలియా వేదికగా ఆసీస్ పాకిస్థాన్​ జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్ట్ మ్యాచ్​ల సిరీస్​ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా టీమ్​ 2-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్​లో పాకిస్థాన్ జట్టు చేసిన పని ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ?

Australia Vs Pakistan Test
Australia Vs Pakistan Test

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 7:35 PM IST

Australia Vs Pakistan Test : వరల్డ్​ కప్​ ఓటమి తర్వాత తమ సత్తా చాటేందుకు పాకిస్థాన్ జట్టు మైదానంలోకి దిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ జట్టు అక్కడి ప్లేయర్లతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అయితే ఫామ్​ లేమి కారణంగా అటు బ్యాట్స్‌మెన్‌గానీ, బౌలర్లుగానీ మంచి ఫలితాలను అందుకోలేకపోతున్నారు. దీంతో పాక్ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన పాక్ క్రికెట్ అభిమానులు మరింత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

వన్​ బాల్ - 5 రన్స్!
టెస్ట్​ సిరీస్​లో భాగంగా ప్రస్తుతం పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య పోరు జరుగుతోంది. అయితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్​లో భాగంగా క్రీజులో ప్యాట్ కమ్మిన్స్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీలు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ బౌలర్ జమాల్ వేసిన ఓ బంతిని కమ్మిన్స్ షాట్ ఆడాడు. ఆ బాల్ కాస్త ఇద్దరు ఫీల్డర్ల మధ్యలో నుంచి వెళ్లింది. అయితే ఆ బాల్​ను ఆపి బౌలర్ వైపు త్రో చేశాడు పాక్ ఫీల్డర్. కానీ దాన్ని పట్టుకోవడంలో షాహీన్ అఫ్రిది విఫలం కావడం వల్ల ఆ బంతి కాస్త బౌండరీ వైపుకు దూసుకెళ్లింది. అప్పటికే క్రీజులో ఉన్న ఆ ఇద్దరూ రెండు పరుగులు పూర్తి చేశారు. అంతలో మిస్ ఫీల్డ్ కావడంతో వల్ల మరో మూడు పరుగులు పూర్తిచేశారు. అలా మెుత్తానికి ఒక్క బాల్​కు ఐదు పరుగులు వచ్చాయి.

ఇలా పేలవ ఫామ్​ను కనబరిచిన పాక్​ ప్లేయర్లపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్ మూడు క్యాచ్‌లను వదిలిపెట్టి తన జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇలా క్యాచ్‌లు వదిలేయడం పాక్ జట్టుకు చాలా నష్టాన్ని చేకూర్చింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్​లో 318 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్​లో మాత్రం 262 రన్స్​ స్కోర్​ చేసింది. మరోవైపు పాకిస్థాన్​ తొలి ఇన్నింగ్స్​లో 264 రన్స్​ స్కోర్ చేయగా, రెండో ఇన్నింగ్స్​లో 237 పరుగులు చేసి 79 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

పాకిస్థాన్​​ ప్లేయర్లకు అవమానం- ఆస్ట్రేలియా అంత పని చేసిందా?

పాకిస్థాన్​ టీ20 లీగ్​లో వింత ఘటన- ఇలా జరగడం చాలా అరుదు!

ABOUT THE AUTHOR

...view details