తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ పర్యటనకు ఆస్ట్రేలియా.. 24 ఏళ్లలో తొలిసారి! - ఆస్ట్రేలియా పాకిస్థాన్ టెస్టు సిరీస్

పాకిస్థాన్​ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. దాదాపు 24 ఏళ్ల తర్వాత పాక్​లో ఆసీస్ సిరీస్​ ఆడేందుకు వెళ్తుండటం విశేషం.

Australia
ఆసీస్

By

Published : Nov 8, 2021, 2:57 PM IST

Updated : Nov 8, 2021, 3:30 PM IST

పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లేందుకు అంగీకారం తెలిపింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఈ పర్యటనలో మూడేసి టెస్టు, వన్డేలు, ఒక టీ20 జరగనున్నాయి. 1998 తర్వాత ఆసీస్.. పాక్​ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

1998లో చివరిసాగిరా పాక్​లో పర్యటించింది ఆస్ట్రేలియా. ఈ టూర్​లో జరిగిన మూడేసి టెస్టు, వన్డేల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆ తర్వాత చాలాసార్లు పర్యటనలు ఖరారైనా.. వివిధ కారాణాలతో రద్దవుతూ వచ్చాయి.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్​ రద్దు చేసుకోగా..

పాకిస్థాన్​లో భద్రతా సమస్యల కారణంగా చాలాకాలంగా అగ్రదేశాలు ఆ దేశంలో టోర్నీలు ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ కొంతకాలంగా అక్కడి పరిస్థితులు దారికొచ్చినట్లు కనిపించిన నేపథ్యంలో శ్రీలంక, జింబాబ్వే, దక్షిణాఫ్రికా.. పాక్​లో పర్యటించాయి. ఆ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం వల్ల ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి జట్లు పాక్​లో సిరీస్​లు ఖరారు చేసుకున్నాయి. పాక్​ పర్యటనకు వెళ్లి కొద్ది నిమిషాల్లో టాస్ పడుతుందనగా.. ఈ పర్యటన నుంచి వైదొలిగి పీసీబీకి గట్టి షాకిచ్చింది కివీస్. ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా తమ పాక్ పర్యటనను రద్దు చేసుకుంది. ఈ సిరీస్​లపై ఇప్పటివరకు స్పష్టత రాకపోగా.. ఆసీస్​ మాత్రం పాక్​లో పర్యటించేందుకు ముందుకొచ్చింది.

షెడ్యూల్

మార్చి 3-7 : తొలి టెస్టు, కరాచీ

మార్చి 12-16: రెండో టెస్టు, రావల్పిండి

మార్చి 21-25: మూడో టెస్టు, లాహోర్

మార్చి 29: మొదటి వన్డే, లాహోర్

మార్చి 31: రెండో వన్డే, లాహోర్

ఏప్రిల్ 2: మూడో వన్డే, లాహోర్

ఏప్రిల్ 5: ఏకైక టీ20, లాహోర్

ఇవీ చూడండి: 'ద్రవిడ్, రోహిత్ కాంబోలో భారత్ ప్రపంచకప్​ గెలుస్తుంది'

Last Updated : Nov 8, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details