తెలంగాణ

telangana

ETV Bharat / sports

INDW vs AUSW: ఆ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ - ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా క్రికెట్

మహిళా క్రికెట్​లో అరుదైన ఘనత సాధించింది ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ ఎలిస్ పెర్రీ. టీమ్​ఇండియాతో (INDW vs AUSW) మ్యాచ్​ సందర్భంగా పూజ వికెట్​తో అంతర్జాతీయ కెరీర్​లో 300వ వికెట్​ను​ తన ఖాతాలో వేసుకుంది.

indw vs ausw
ఎలిస్ పెర్రీ

By

Published : Oct 2, 2021, 6:48 PM IST

ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ ఎలిస్ పెర్రీ అరుదైన ఘనత (Ellyse Perry Record) సాధించింది. అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలో కలిపి 300 వికెట్లు పడగొట్టింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్​లో 5వేల పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెట్​గా అవతరించింది పెర్రీ.

టీమ్​ఇండియాతో (INDW vs AUSW) జరుగుతున్న పింక్ బాల్​ టెస్టు సందర్భంగా పూజ వికెట్​తో పెర్రీ ఈ ఘనత దక్కించుకుంది. ఇప్పటివరకు వన్డేల్లో 3,135 పరుగులు, 152 వికెట్లు.. టీ20ల్లో 1,243 పరుగులు, 115 వికెట్లు తీసింది (Ellyse Perry Stats).

ఈ డేనైట్​ టెస్టు మ్యాచ్​లో (INDW vs AUSW Test 2021) తొలి రెండు రోజులు చెలరేగిన టీమ్​ఇండియా మూడో రోజు 359/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్​ డిక్లేర్ చేసింది. స్మృతి మంధాన 127 పరుగులతో సత్తాచాటగా దీప్తి శర్మ (66) ఆకట్టుకుంది. షెఫాలీ (31), పూనమ్ రౌత్ (36), మిథాలీ (30) పర్వాలేదనిపించారు.

మూడో రోజు ఆట పూర్తయ్యే సరికి.. ఆసీస్​ 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులతో ఉంది. పెర్రీ(27), గార్డ్​నర్​(13) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్, జులన్​ గోస్వామి చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా ఇంకా 234 పరుగుల వెనుకంజలో ఉంది. ​

ఇవీ చూడండి:

5 ఏళ్ల వివాహబంధానికి ఎలిస్​ పెర్రీ- మ్యాట్​ గుడ్​బై

ఆటతోనే కాదు అందంతోనూ అదరగొట్టేస్తారు!

ABOUT THE AUTHOR

...view details