Asia Cup Records : ఆసియాకప్‌నకు వేళైంది. మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో ఆరు జట్లు పోటీలో ఉన్నాయి. క్రికెట్ అభిమానుల్లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థానే పోరే అత్యంత ఆసక్తిరేపుతోంది. బుధవారం(ఆగస్ట్ 30) పాకిస్థాన్, నేపాల్ మధ్య మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం...
- మరి కొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్‌నకు ముందు తమ కూర్పును సరిచేసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి, బలాబలాలను అంచనా వేసుకోవడానికి.. ఈ ఆసియా కప్ ఓ చక్కని అవకాశం.
- Asia Cup 2023 Format : రౌండ్ రాబిన్ విధానంలో ఈ టోర్నీ జరగనుంది. ఇందులో రెండు గ్రూపులు ఉన్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ పోటీపడనున్నాయి. రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ దశకు వెళ్తాయి. అందులో తొలి టాప్-2 ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో భారత్ రెండు లేదా మూడు సార్లు పోటీ పడే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో ఆడడం నేపాల్‌కు ఇదే తొలిసారి.
- Asia Cup Highest Run Scorer in Teamindia : సచిన్‌ను రికార్డ్ బ్రేక్ చేస్తారా?.. ఆసియాకప్‌లో భారత తరఫున సచిన్ తెందుల్కర్ అత్యధిక స్కోరర్‌గా ఉన్నాడు. 23 మ్యాచ్‌ల్లో 2 శతకాలు, 7 అర్ధశతకాలు సాయంతో 971 పరుగులు చేశాడు. అతడిని అధిగమించేందుకు కెప్టెన్ రోహిత్, కోహ్లీలకు ఈ టోర్నీ ఓ చక్కని అవకాశం. హిట్ మ్యాన్ ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 745 పరుగులు చేయగా.. కోహ్లి 613 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
- Asia Cup 2023 Team India : భారత్ ఏడుసార్లు.. ఇది 16వ ఆసియా కప్. గత 15 ఆసియాకప్పుల్లో 13 వన్డే ఫార్మాట్లు జరిగాయి. రెండు సార్లు మాత్రమే టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. గతసారి పొట్టి క్రికెట్ ఆడారు. వరల్డ్ కప్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఈ సారి వన్డే ఫార్మాట్లో ఈ ఆసియాకప్ ను నిర్వహించారు. అయితే ఈ మెగా టోర్నీలో భారత్‌కు మెరుగైన రికార్డ్ ఉంది. టీమ్‌ఇండియా ఏడుసార్లు(1984, 1988, 1990-91, 1995, 2010, 2016-టీ20, 2018) ఆసియాకప్ ట్రోఫీని ముద్దాడింది. 1984లో మొదలైన ఈ టోర్నీలో టీమ్‌ఇండియా మొత్తంగా 49 వన్డేలు ఆడగా 31 మ్యాచుల్లో గెలిచింది.
- Asia cup 2023 Ind Vs Pak : పాక్ జట్టుకు బాబర్ అజామ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమ్ఇండియాకు రోహిత్ శర్మ. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ అత్యంత ఆసక్తి రేపుతోంది. శనివారం జరగబోయే ఈ మ్యాచ్ కోసం.. రెండు దేశాల అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిరకాల ప్రత్యర్థులకు పెద్ద చరిత్రే ఉంది. ఆసియాకప్‌లో ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు 13 సార్లు తలపడగా.. ఏడు సార్లు టీమ్‌ఇండియా, ఐదు సార్లు పాకిస్థాన్ గెలిచాయి. 2018లో జరిగిన రెండు సార్లూ టీమ్‌ఇండియానే విజయం సాధించింది. ఆసియా కప్ పాక్‌తో జరిగిన గత ఐదు మ్యాచుల్లో భారత్ నాలుగు సార్లు గెలిచింది.
- ఈ టోర్నీతోనే టీమ్‌ఇండియా మిడిల్ ఆర్డర్‌పై ఓ క్లారిటీ రానుంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేస్తున్న ప్లేయర్స్.. ఈ ఆసియా కప్‌కు పూర్తి సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్నది తెలియనుంది.
- ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో.. అత్యధిక వికెట్ల వీరుడు మురళీధరన్ 30 .
- 87 అత్యల్ప స్కోరు. 2000లో పాకిస్థాన్‌పై బంగ్లా చేసిన స్కోరు ఇది.
- 183 అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ రికార్డు 2012లో పాకిస్థాన్‌పై కోహ్లీ సాధించాడు.
- 1220 టాప్ స్కోరర్. జయసూర్య (25 మ్యాచ్‌ల్లో) పేరిట ఈ రికార్డు ఉంది.
- 385/7 అత్యధిక స్కోరు. 2010లో బంగ్లా దేశ్‌పై పాకిస్థాన్ ఈ స్కోరును అందుకుంది.