Asia Cup 2023 Pak vs Nepal:ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లలో.. కెప్టెన్ బాబర్ అజామ్ (151 పరుగులు : 131 బంతుల్లో, 14x4, 4x6), ఇఫ్తికార్ అహ్మద్ (109 పరుగులు : 71 బంతుల్లో, 11x4, 4x6) శతకాలతో చెలరేగారు. ఫలితంగా పాక్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. తర్వాత ఛేదనలో పాక్ బౌలర్ల ధాటికి.. నేపాల్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఫలితంగా నేపాల్ ఇన్నింగ్స్ 104 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, హరీస్ రౌఫ్ 2, షహీన్ అఫ్రిదీ 2, ససీమ్ షా, నవాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక సెంచరీతో కదం తొక్కిన బాబార్ అజామ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 6.1 ఓవర్లకే పాక్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. ఫకర్ జమాన్ (14) తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ.. కరణ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్.. రనౌట్‌గా వెనుగిరిగాడు. ఇక కెప్టెన్ బాబర్(Babar Azam), వికెట్ కీపర్ రిజ్వాన్ (44)తో కలిసి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు.