Asia Cup 2023 Babar Azam : ఆసియా కప్ 2023 మొదలైపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్-నేపాల్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతంగా రాణించాడు. మరోసారి తన సత్తాను ప్రపంచానికి చూపించాడు. విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ శతకం.. బాబర్‌కు తన కెరీర్లో 19వ వన్డే సెంచరీ. అలానే ఈ మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో అతడు.. పలు అరుదైన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అలానే వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
Asia Cup 2023 Nepal VS Pakistan :బాబర్ సాధించిన రికార్డులు ఇవే.. వన్డేల్లో అత్యంత వేగంగా 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా బాబర్ ఘనతను అందుకున్నాడు. ఈ మార్క్‌ను బాబర్ కేవలం 102 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు. అంతకముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్ హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌లలో సాధించగా.. విరాట్ 124 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో వీరిద్దరిని రికార్డును బాబర్ ఆజమ్ అధిగమించాడు.
ఆసియాకప్ హిస్టరీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన కెప్టెన్‌గా బాబర్ మరో రికార్డును కూడా అధిగమించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(136) పేరిట ఉండేది. కానీ తాజా మ్యాచ్‌లో అడామ్ 151 పరుగులు చేసి.. విరాట్ రికార్డును బ్రేక్ చేశాడు.