కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత ఆసియా కప్ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. దీంతో ఎలాగైనా గెలిచి తీరాలని రెండు జట్లు కంకణం కట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనుండటం వల్ల.. ఈ మ్యాచ్‌పై అందరి ఆసక్తి నెలకొంది. ఇది కోహ్లీకి వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లీ తన మునుపటి ఫామ్‌ను అందుకుంటాడేమోనని అభిమానులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.
భారత్ పాక్ మ్యాచ్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన - ఇండియా పాకిస్థాన్ మ్యాచ్
18:58 August 28
భారత్ పాక్ మ్యాచ్, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన
అయితే, టీమ్ సెలక్షన్ విషయంలో రోహిత్- ద్రావిడ్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇది కఠినమైన నిర్ణయమని, దురదృష్టవశాత్తు పంత్‌ను ఆడించలేకపోతున్నామని టాస్ సమయంలో రోహిత్ చెప్పాడు. ఇక అదనపు స్పిన్నర్‌కు బదులు మూడో పేసర్‌గా అవేష్ ఖాన్‌ను తీసుకున్నారు.
జట్లు
భారత్:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్
పాకిస్థాన్:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ