ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్కు ముందు ఆ జట్టుకు టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) హెచ్చరికలు జారీచేశాడు! కౌంటీ క్రికెట్లో సర్రె జట్టుకు అశ్విన్.. ఒక్క ఇన్నింగ్స్లో 29 పరుగులిచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో సోమర్సెట్ 429 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. సర్రే 240 పరుగులకు ఆల్ఔటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లు వేసిన అశ్విన్.. ఆరు వికెట్లు తీశాడు. ఇతడితో పాటు మరో క్రికెటర్ డేనియల్ మోరిఆర్టీ 4 వికెట్లు పడగొట్టడం వల్ల సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సర్రే నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి ఈ మ్యాచ్ను డ్రాగా ముగించింది.