తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​లో అదరగొట్టిన అశ్విన్​, శ్రేయస్​.. దూసుకెళ్లారుగా! - ​ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ 2022

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్​ఇండియా ప్లేయర్స్​ రవిచంద్రన్‌ అశ్విన్‌,  శ్రేయస్‌ అయ్యర్ అదరగొట్టారు. ఆ వివరాలు..

icc mens test player rankings 2022
icc mens test player rankings 2022

By

Published : Dec 28, 2022, 5:10 PM IST

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టుపై టీమ్​ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్​ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన అశ్విన్.. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడం సహా సెకండ్స్ ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఐసీసీ బౌలర్ల జాబితాలో 812 పాయింట్లతో మరో టీమ్​ఇండియా పేసర్‌ బుమ్రాతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానాన్ని పంచుకున్నాడు.

అదే సమయంలో ఆల్‌రౌండర్ల జాబితాలో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన 84వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇదే బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ 880 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. జేమ్స్ అండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. రబాడ మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ మూడో స్థానంలో ఉన్నాడు.
అశ్విన్‌తోపాటు శ్రేయస్ అయ్యర్ సైతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులు చేయడం సహా.. రెండో ఇన్నింగ్స్‌లో 29 నాటౌట్‌తో అశ్విన్‌కు అండగా నిలిచిన అయ్యర్ కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఏకంగా 10 స్థానాలు ఎగబాకి.. బ్యాటర్ల జాబితాలో 16వ స్థానానికి చేరుకున్నాడు. ఇక వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ స్థానంలో ఎలాంటి మార్పు లేదు. బంగ్లాతో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన పంత్‌ తన ఆరో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రోహిత్‌ శర్మ తొమ్మిదో స్థానంలో.. కోహ్లీ రెండు స్థానాలు దిగజారి 14వ స్థానంలో నిలిచాడు. ఇక బంగ్లాతో జరిగిన సిరీస్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికైన పుజారా కూడా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానంలో నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details