టీ20 ప్రపంచకప్(T20 world cup) అనంతరం టీమ్ఇండియా సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చాలా మంది దిగ్గజాలు కేఎల్ రాహుల్, రోహిత్ పేర్లు చెబుతున్నారు. మరికొంత మంది పంత్‌కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ పేసర్ అశిష్ నెహ్రా(Ashish Nehra on Bumrah) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని ఓ పేసర్‌కు సారథి అయ్యే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. బుమ్రాను జట్టుకు కెప్టెన్ చేయాలని సూచించాడు.
"రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వీరు అన్ని ఫార్మాట్లలో ఆడి తమ ప్రతిభను చాటారు. కొన్నిసార్లు జట్టు నుంచి కూడా డ్రాప్ అయిన సందర్భాలున్నాయి. అయితే.. పేసర్ బుమ్రా కూడా టీమ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఆటను బాగా అర్థం చేసుకోగలడు. పేసర్లు కెప్టెన్ అవకూడదు అని ఎక్కడా లేదు."
--అశిష్ నెహ్రా, మాజీ ఆటగాడు.