యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి 46.5ఓవర్లు మాత్రమే ఆడిన ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖాజా(4*), స్టీవ్ స్మిత్(6) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్ తలో వికెట్ తీశారు.
Eng Vs Aus: తొలి రోజు ఆట వరుణుడిదే.. ఆసీస్ 126/3 - యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్
Eng Vs Aus Fourth test: ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు వర్షం అడ్డుగా మారింది. దీంతో మూడు సెషన్స్‌లో 46.5 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు వర్షం కారణంగా తొలి రెండు సెషన్లు సరిగ్గా సాగలేదు. రెండు సార్లు ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఓపెనర్లుగా వచ్చిన వార్నర్(30; 6x4), మార్కస్ హ్యారిస్(38) బాగానే రాణించారు. బ్రాడ్ బౌలింగ్ వార్నర్.. 20.6వ ఓవర్ వద్ద జాక్ క్రాలే చేతికి చిక్కి తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మార్కస్.. అండర్సన్ బౌలింగ్‌లో రూట్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక మార్నస్ లబుషేన్(28) మార్క్ వుడ్ బౌలింగ్‌లో 40.2వ ఓవర్ వద్ద జాస్ బట్లర్ చేతికి చిక్కాడు. మొత్తంగా మూడు సెషన్లు పూర్తయ్యేసరికి 46.5 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 126 రన్స్ చేసింది.
ఇదీ చూడండి: బిగ్‌బాష్ లీగ్‌లో కరోనా కలకలం.. మ్యాక్స్‌వెల్‌తో పాటు 12 మందికి పాజిటివ్