Ashes series 2023 Jonny bairstow run : ఇంగ్లాండ్ రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో ఔటైన విధానం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతటా దీని గురించే పెద్ద ఎత్తు చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఇంగ్లాండ్ జట్టు కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్, మరో ప్లేయర్ స్టోక్స్ మాట్లాడారు.
"ఇది క్రీడా స్ఫూర్తికి సంబంధించినది. అనుభవం పెరిగేకొద్ది, పరిణతి చెందినప్పుడు.. క్రీడా స్ఫూర్తిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. క్షణంలో తీసుకునే నిర్ణయాలు, ఆటపై, అలాగే వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. నిబంధనల ప్రకారం బెయిల్ స్టో ఔట్. అతడు పరుగు చేయడానికి ప్రయత్నించలేదు. అప్పుడే అంపైర్ ఓవర్ అయిపోయిందని ప్రకటించలేదు. జీర్ణీంచుకోవడానికి కష్టంగా ఉండే సంఘటనలలో ఇదీ ఒకటి. నన్ను చాలా నిరాశపరిచింది." అని మెక్ కలమ్ అన్నాడు. ఈ ఔట్ వల్ల ఇరు జట్ల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా అన్నాడు.
"బెయిర్‌స్టో క్రీజులోనే ఉన్నాడు. ఆ తర్వాతే మాట్లాడానికి మధ్యలో క్రీజు వదిలి బయటకు వచ్చాడు. అది ఔట్ కాదు అని నేను అనట్లేదు. అది ఔటే. ఒకవేళ నేను అతడి స్థానంలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. నేను ఇంత వివాదంగా మార్చను. క్రీడా స్ఫూర్తి గురించి లోతుగా ఆలోచించి, నేను అలానే చేయాలనుకుంటున్నాను." అని స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు.
బెయిర్ స్టో ఔట్ పట్ల ఆసిస్ కెప్టెన్ కమిన్స్ స్పందిస్తూ.. రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఓటేనని చెప్పుకొచ్చాడు. ' బెయిర్ స్టో ఔటైన విధానం క్రికెట్లో చాలా అరుదు. మేము అతడిని ఔట్ చేసిన దాంట్లో ఎలాంటి తప్పిదం లేదు. బెయిర్ స్టో ప్రతీ బంతికి క్రీజు దాటుతున్నాడు. అలా అతడు నాలుగు, ఐదు సార్లు చేశాడు. క్రికెట్లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా క్రీజులో ఉండాల్సిందే. ఇంగ్లాండ్ జట్టుపై మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. మేము వారితో ఎప్పటికీ సన్నిహితంగానే ఉంటాం' అని కమిన్స్ అన్నాడు.