Ashes 2021: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బాక్సింగ్ డే టెస్టుగా మొదలైన ఈ మ్యాచ్‌ను ఆసీస్ రెండున్నర రోజుల్లోనే పూర్తి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 68కే ఆలౌట్ చేసి.. ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. 31/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. మరో 37 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ (28), బెన్‌స్టోక్స్ (11) టాస్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ స్కాట్ బోలాండ్ 6/7 సంచలన ప్రదర్శన చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 267 పరుగులు చేసింది.