Anushka-Virat Baby :విరుష్క(విరాట్-అనుష్క) జంట ఎక్కడ కనిపించినా.. వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారతాయి. అయితే నవంబర్ 12న(ఆదివారం) నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ కోసం వీరిద్దరు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. అదే అనుష్క శర్మ రెండో ప్రెగ్నెన్సీ గురించి. తాజాగా ఇద్దరు కలిసి బెంగళూరులోని ఓ హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎవరో దాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇక అంతే ప్రస్తుతం అది తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అనుష్క త్వరలోనే తన రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని కామెంట్లు పెడుతున్నారు.
Anushka Sharma Baby Bump Viral Video :గత కొద్దిరోజులుగా అనుష్క మళ్లీ గర్భం దాల్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లకు బలాన్ని చేకూర్చే విధంగా ఈ తాజా వీడియో ఉందంటున్నారు కొందరు అభిమానులు. అందులో విరాట్, అనుష్క ఓ హోటల్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఉంది. ఇందులో విరాట్ గ్రే కలర్ టీ-షర్ట్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించగా.. అనుష్క బ్లాక్ కలర్లో వదులుగా ఉన్న ఫ్రాక్ను వేసుకున్నారు.
ప్రస్తుతం ఈ డ్రెస్‌ను చూసిన కొందరు.. అనుష్క త్వరలోనే తన రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారంటూ తెగ సంబరపడిపోతున్నారు. అయితే తన ప్రెగ్నెన్సీ బయటకు కనపడకుండా ఉండేందుకే అనుష్క ఇలాంటి బట్టలు ధరించారని.. ఆమె నడకలో కూడా మార్పును గమనించవచ్చని అంటున్నారు చాలామంది. అంతేకాకుండా ఆ వీడియోలో స్పష్టంగా అనుష్క బేబీ బంప్ సైతం కనిపిస్తుందంటూ వివరిస్తున్నారు. అయితే ఈ వార్తలు కేవలం గాసిప్సే అని కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తూ.. వారి(విరాట్-అనుష్క) నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగలేరా అంటు ఫైర్ అవుతున్నారు.