తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రధాని మోదీ గురువు ఆశ్రమానికి కోహ్లీ-అనుష్క! - విరాట్ అనుష్క లేటెస్ట్ న్యూస్

స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ-హీరోయిన్​ అనుష్క జంట ఆధ్యాత్మిక వాతావరణంలో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి రిషికేష్​ యాత్రకు వెళ్లాడు.

anushka sharma takes a spiritual break in rishikesh with virat kohli
ప్రధాని మోదీ గురువు నుంచి ఆశీర్వాదం తీసుకున్న విరుష్క

By

Published : Jan 31, 2023, 11:55 AM IST

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లీ-అనుష్క శ‌ర్మ‌ దంపతులు రిషికేశ్‌ తీర్థ యాత్ర‌కు వెళ్లారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువైన స్వామి ద‌యానంద్ స‌ర‌స్వ‌తీ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ద‌యానంద్​ స‌మాధిని దర్శించుకుని ఆశిస్సులను తీసుకున్నారు. అక్కడ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇకపోతే ఫిబ్ర‌వ‌రిలో ఆస్ట్రేలియా జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌నుకు రానుంది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఇరుజ‌ట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. నాగ్‌పుర్‌లో ఫిబ్ర‌వ‌రి 9న తొలి టెస్టు ప్రారంభంకానుంది. దీంతో పాటే ఈ ఏడాది వ‌రల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ కూడా జరగనుంది. దీంతో భారత్‌కు ఈ టెస్టు సిరీస్ కీల‌కం కానుంది. ఇప్ప‌టికే ఆస్ట్రేలియా ఫైన‌ల్ బెర్తు ఖ‌రారు చేసుకుంది. ఇక పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉన్న టీమ్​ఇండియా కూడా ఈ ఫైన‌ల్ బెర్తుపై క‌న్నేసింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్​ శర్మ, శుభ్‌మ‌న్ గిల్ ఫామ్​ అందుకోవడం, అలానే జట్టులో సూర్య‌కుమార్ యాద‌వ్, ఇషాన్ కిష‌న్ వంటి హిట్ట‌ర్లు తొలి రెండు టెస్టుల‌కు ఆడనుండటం భార‌త్‌కు కలిసొచ్చే అవకాశం.

ఇకపోతే అనుష్క శర్మ.. ప్రస్తుతం అనుష్క శర్మ చక్దా ఎక్స్‌ప్రెస్‌ అనే క్రికెట్‌ బయోపిక్‌లో నటిస్తోంది. మాజీ మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి జీవితకథగా ఈ చిత్రం రూపొందనుంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details