- మొత్తంగా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచ్‌లాడిన టీమ్ఇండియా.. 12 గెలిచింది. 72.2 శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి, ఫైనల్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో 7 గెలిచి, 70 శాతం విజయాలతో రెండోస్థానంలో నిలిచి, తుదిపోరుకు వచ్చింది.
- సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా రెట్రో లుక్ జెర్సీతో కనిపించనుంది. 1980ల నాటి జెర్సీని ఇది పోలి ఉంటుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
- ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రూ.11.71 కోట్లు లభించనుండగా, ఓడిన టీమ్‌కు రూ.5.85 కోట్లు దక్కనున్నాయి.
- ఐదు రోజులపాటు జరగనున్న ఈ టెస్టు.. ఒకవేళ డ్రా, టై అయితే ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. ఆరో రోజును రిజర్వ్‌డేగా ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.
- భారత స్పిన్నర్ అశ్విన్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అశ్విన్ 67, కమిన్స్ 70 వికెట్లతో ఉన్నారు.
- కరోనా ప్రభావం తర్వాత క్రికెట్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఈ పోరుకు అభిమానులను అనుమతించారు. దీంతో ఒక్కో టిక్కెట్ రూ.2 లక్షలకు అమ్ముడుపోయినట్లు సదరు టిక్కెట్లు అమ్మే ఏజెన్సీ నిర్వహకులు వెల్లడించారు.
- ఈ మ్యాచ్ చూసేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషా కూడా వెళ్లనున్నారు.
- ఈ మ్యాచ్‌కు మన దేశం నుంచి సునీల్ గావస్కర్, దినేశ్ కార్తిక్ కామెంటరీ చెప్పనున్నారు.
- స్టార్ స్పోర్ట్స్.. ఈ టెస్టును ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.
- ఈ మ్యాచ్ కోసం పేస్, బౌన్సింగ్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు క్యూరేటర్ సైమన్లీ చెప్పారు.
- ఈ మ్యాచ్‌కు భారీ వర్ష సూచన ఉందని సమాచారం. దాదాపు 80 శాతం మేర వర్షం కురవొచ్చని పలు వెబ్సైట్లు చెబుతున్నాయి.
జట్లు
భారత్: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, విహారి, పంత్, సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేష్ యాదవ్, సిరాజ్.