Ajinkya Rahane: భారత క్రికెటర్ అజింక్యా రహానే తాను క్రికెట్ నేర్చుకున్న పాఠశాలతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ముంబయి డోంబివ్లిలోని ఎస్వీ జోషి హైస్కూల్‌కు సంబంధించిన వీడియోను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
"మీ మూలాల్ని సందర్శించడం వల్ల మీరు అణకువగా ఉంటారు. డోంబివ్లి ఎంత మార్పు చెందిన నా హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది." అని పోస్ట్ చేశాడు. రహానే తన భార్య రాధిక, కుమార్తె ఆర్యతో కలిసి తాను క్రికెట్ నేర్చుకున్న మైదానానికి వచ్చాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్న తన చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకున్నాడు.
"ఇక్కడికి రావాలని చాలా ఏళ్లుగా అనుకుంటున్నాను ఈరోజు జరిగింది. ఈ మైదానం నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాను. స్కూల్ నాకు చాలా అండగా నిలిచింది. స్కూల్లో అనేక మార్పులు వచ్చాయి ఇక్కడికి రావడం నాకు ప్రత్యేకంగా అనిపించింది."