ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చితే ఇలానే ఉంటుంది: జడేజా - undefined

టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా వైఫల్యాన్ని విశ్లేషించిన అజేయ్ జడేజా, సెహ్వాగ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై విమర్శలు గుప్పించారు. సెలెక్టర్ల అనాలోచిత నిర్ణయాలే టీమ్​ఇండియా దుస్థితి కారణమని ఆరోపించారు. ఇంకేమన్నారంటే?

team india
team india
author img

By

Published : Nov 11, 2022, 9:51 PM IST

టీమ్‌మేనేజ్‌మెంట్, సెలెక్టర్ల అనాలోచిత నిర్ణయాలే టీమ్​ఇండియా దుస్థితి కారణమని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చితే ఫలితాలు ఇలానే ఉంటాయని అజయ్​ జడేజా మండిపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2022లో వరుస విజయాలతో జోరు కనబర్చిన టీమ్​ఇండియా.. కీలక సెమీఫైనల్లో చేతులెత్తేసింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయంతో మరోసారి ప్రపంచకప్ గెలవకుండానే ఇంటిదారిపట్టింది. ఈ ఓటమి అనంతరం టీమ్​ఇండియా వైఫల్యాన్ని విశ్లేషించిన అజేయ్ జడేజా, సెహ్వాగ్.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై విమర్శలు గుప్పించారు.

ముందుగా జడేజా మాట్లాడుతూ.. "నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. బహుశా అది వింటే రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లు బాధ పడొచ్చు. ఒక జట్టును తయారుచేసే క్రమంలో కెప్టెన్ నిత్యం వాళ్లతోనే ఉండాలి. దీర్ఘకాలం పాటు ఆటగాళ్లతో మంచి సంబంధాలు పెంచుకోవాలి. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్‌ను సారథిగా నియమించారు. ఈ ఏడాదికాలంలో రోహిత్ ఎన్ని సిరీస్‌లు ఆడాడు."

"నేను ఇదే చాలా రోజుల నుంచే చెబుతున్నా. సిరీస్​కు ఒక సారథిని మార్చినట్టు మార్చుతున్నారు. ఇప్పుడు కూడా చూడండి. టీ20 ప్రపంచకప్ ముగిసింది. దీని తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్​లో రోహిత్​కు విశ్రాంతినిచ్చారు. ఒక జట్టులో ఒకడే నాయకుడు ఉంటే అది అందరికీ మంచిది. అలా కాకుండా ఏడుగురు సారథులుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి" అని జడేజా విమర్శించాడు.

ఇక వీరేంద్ర సెహ్వాగ్ కూడా రోహిత్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. "పదే పదే బ్రేకులు తీసుకోవాల్సినంత సీరియస్ క్రికెట్ వీళ్లు ఏం ఆడుతున్నారని ప్రశ్నించాడు. అసలు రోహిత్ ఈ ఏడాది ఎన్ని సిరీస్ ఆడాడని ప్రశ్నించాడు. ఇక సారథుల విషయానికొస్తే టీమ్​ఇండియా సారథి పోస్ట్ అనేది ఓ మ్యూజికల్ చైర్ ఆటగా మారింది. కోహ్లీ నిష్క్రమణ తర్వాత రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలు భారత జట్టుకు సారథులుగా పనిచేశారు. " అంటూ సెహ్వాగ్​ మాట్లాడాడు.

For All Latest Updates

TAGGED:

team india

ABOUT THE AUTHOR

...view details