తెలంగాణ

telangana

ETV Bharat / sports

త్వరలో టీ10 లీగ్​.. ఫ్యాన్స్​కు 'డబుల్​' బొనాంజా - మోర్గాన్

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి టీ10 లీగ్​ సిద్ధమైంది. నవంబర్​ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్​ (Abu Dhabi T10) మొదలవుతుంది. తొలి రోజే రెండు మ్యాచ్​లు జరగనున్నాయి.

Abu Dhabi T10
అబుదాబి టీ10 లీగ్​

By

Published : Nov 8, 2021, 5:35 PM IST

టీ10 లీగ్​ ఐదో సీజన్(Abu Dhabi T10 Season 5) నవంబర్​ 19 నుంచి అబుదాబిలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఢిపెండింగ్​ ఛాంపియన్స్​ నదరన్ వారియర్స్​, దిల్లీ బుల్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది. ఇంగ్లాండ్​ ద్వయం మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్​.. రెండుసార్లు ఛాంపియన్​గా నిలిచిన నదరన్ వారియర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. దిల్లీ తరఫున డ్వేన్​ బ్రావో (Dwayne Bravo News), ఇయాన్ మోర్గాన్​ లాంటి స్టార్​ క్రికెటర్లు ఉన్నారు.

రెండో మ్యాచ్​ (Abu Dhabi T10 Teams) టీమ్​ అబుదాబి, బంగ్లా టైగర్స్​ మధ్య జరగనుంది. అబుదాబి జట్టులో వెస్టిండీస్​ దిగ్గజం క్రిస్ గేల్, ఇంగ్లాండ్ సూపర్​స్టార్ లియామ్ లివింగ్​స్టోన్ ఉన్నారు. బంగ్లా టైగర్స్​లో పాకిస్థాన్​ మాజీ ఆల్​రౌండర్​ షాహిద్ అఫ్రిదీ, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్​ ఉన్నారు.

రెండో రోజు యూసుఫ్ పఠాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై బ్రేవ్స్​.. ఆండ్రీ రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెక్కన్ గ్లేడియేటర్స్​ను ఢీకొట్టనుంది. మొత్తంగా ఈ లీగ్​లో జాయెద్​ క్రికెట్ స్టేడియంలో 15 రోజుల పాటు 35 మ్యాచ్​లు జరగనున్నాయి. క్వాలిఫైయర్స్​ డిసెంబర్ 3న జరగనుంది.

ఇదీ చూడండి:పాక్​ పర్యటనకు ఆస్ట్రేలియా.. 24 ఏళ్లలో తొలిసారి!

ABOUT THE AUTHOR

...view details