తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అందుకే డివిలియర్స్​ జట్టులోకి రావట్లేదు'

తిరిగి జట్టులోకి రాకపోవడానికి మాజీ క్రికెటర్ డివిలియర్స్​కు కారణాలు ఉన్నాయని తెలిపాడు దక్షిణాఫ్రికా కోచ్​ మార్క్ బౌచర్. తాను జట్టులోకి వస్తే ఆ స్థానాన్ని ఆశిస్తున్నా మరో ఆటగాడికి అన్యాయం జరుగుతుందన్న కారణంగానే ఏబీ క్రికెట్ పునరాగమనానికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

By

Published : May 19, 2021, 7:07 PM IST

Boucher, south africa head coach
మార్క్ బౌచర్, దక్షిణాఫ్రికా జట్టు ప్రధాన కోచ్

మాజీ క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​ ఇప్పటికీ టీ20 క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాడు అని కొనియాడాడు దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ మార్క్ బౌచర్. పొట్టి ప్రపంచకప్​కు ముందు ఏబీ.. తిరిగి జట్టులోకి రాకపోవడానికి చాలా కారణాలున్నాయని వెల్లడించాడు.

"డివిలియర్స్ జట్టులోకి తిరిగి రాకపోవడానికి కారణాలున్నాయి. అతడి నిర్ణయం పట్ల గౌరవం ఉంది. దురదృష్టవశాత్తూ, గత కొంత కాలంగా అతడు జట్టులో లేడు. దురదృష్టవశాత్తూ అని ఎందుకంటున్నాను అంటే.. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో ఒకడు" అని బౌచర్​ పేర్కొన్నాడు.

" అతను టీమ్​లోకి వస్తే ఆ స్థానాన్ని ఆశిస్తున్నా మరో క్రికెటర్​కు ఇబ్బంది కలుగుతుందని ఏబీ చెప్పారు తెలిపాడు. కానీ, ఒక కోచ్​గా అత్యుత్తమ జట్టు ఎంపిక చేయడానికే నేను మొగ్గు చూపుతాను. డివిలియర్స్​ ఏ వాతావరణంలోనైనా ఒక శక్తి లాంటివాడు. కానీ అతడి వాదన కూడా సరైనదే. ఇక ముందుకెళ్లాల్సిందే" అని బౌచర్​ తెలిపాడు.

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో భారత్​ వేదికగా పొట్టి వరల్డ్​కప్ జరగనున్న నేపథ్యంలో.. డివిలియర్స్​ తిరిగి టీమ్​లోకి వస్తాడంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన క్రికెట్ సౌతాఫ్రికా.. రిటైర్మెంట్ విషయంలో అతడి నిర్ణయమే ఫైనల్​ అని స్పష్టం చేసింది. ఏబీ తిరిగి జట్టులోకి రాడని తేల్చి చెప్పింది.

ఇదీ చదవండి:డబ్ల్యూటీసీ మ్యాచ్​ రద్దైతే పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details