తెలంగాణ

telangana

ETV Bharat / sports

Team India: సూర్య, శ్రేయస్‌.. ప్రపంచకప్​ జట్టులో ఎవరు? - సూర్యకుమార్‌ యాదవ్

రానున్న టీ-20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా(Team India) మిడిల్ ఆర్డర్ బ్యాట్స్​మన్​గా ఎవరు ఉండాలన్న దానిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. సూర్యకుమార్‌(surya kumar yadav) యాదవ్‌ను ఎంపిక చేయాలా? లేదా శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోవాలా? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమన్నారు.

surya kumar, shreyas iyer
సూర్య, శ్రేయస్‌

By

Published : Jul 11, 2021, 5:29 PM IST

రాబోయే టీ-20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయాలా లేదా శ్రేయస్‌ అయ్యర్‌(shreyas iyer)ను తీసుకోవాలా అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియాలో సూర్యకుమార్‌ చోటు దక్కించుకోగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దాంతో అతడిని లంక పర్యటనకు ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూట్యూబ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చోప్రా ఇలా సమాధానమిచ్చాడు.

శ్రేయస్‌, సూర్యకుమార్‌(surya kumar yadav)ల ఎంపిక విషయంలో తాను కానీ, టీమ్‌ఇండియా సెలెక్టర్లు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పాడు.

కష్టమైన ప్రశ్న..

"ఇది చాలా కష్టతరమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పే స్థితిలో నేను లేను. అలాగే సెలెక్టర్లు కూడా చెప్పలేరు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌, రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తే కోహ్లీ మూడో స్థానంలో ఆడతాడు. తర్వాత హార్దిక్‌, రిషభ్‌ పంత్‌.. ఐదు, ఆరు స్థానాల్లో ఉంటారు. ఆపై రవీంద్ర జడేజా(jadeja), వాషింగ్టన్‌ సుందర్‌(washington sundar) వరుసగా ఉన్నారు. అలాంటప్పుడు అక్కడ మిగిలింది నాలుగో స్థానమే. దాంతో శ్రేయస్‌(shreyas iyer)ను తీసుకోవాలా లేక సూర్యకుమార్‌ను ఎంపిక చేయాలా అనేది కఠిన నిర్ణయంగా మారుతుంది" అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

"అయితే, శ్రేయస్‌ను ఎంపికచేయడానికి ప్రధాన కారణాలు.. అతడికి మంచి అనుభవం ఉండటం. వన్డే జట్టులో ఇదివరకే బాగా ఆడటం. మరోవైపు దిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి. మరోవైపు సెప్టెంబర్‌లో జరిగే ఐపీఎల్‌లో మరోసారి బాగా ఆడితే అతడిని ఎంపిక చేయొచ్చు. ఇక సూర్యకుమార్‌ కూడా ఈ లంక పర్యటనలో దంచికొట్టి, ఆపై ఐపీఎల్‌లో మెరిస్తే అతడిని కూడా ప్రపంచకప్‌ ఈవెంట్‌కు ఎంపిక చేయొచ్చు.

ఇది ఎటూ అర్థంకాని పరిస్థితి. ఇద్దరూ బాగా ఆడతారు. టీ20ల అనుభవం కూడా బాగుంది. అలాంటప్పుడు ప్రస్తుత ఫామ్‌ను చూసే వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది" అని మాజీ క్రికెటర్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

ఇదీ చదవండి :'సూర్య ఇలాగే ఆడితే నేను ఏ స్థానానికైనా రెడీ'

IPL: ఐపీఎల్‌కు శ్రేయస్​ రెడీ.. మరి కెప్టెన్సీ?

ABOUT THE AUTHOR

...view details