తెలంగాణ

telangana

ETV Bharat / sports

వరల్డ్​ కప్​నకు​ అర్హత సాధించిన శ్రీలంక.. రేసు నుంచి జింబాబ్వే ఔట్​ - ప్రపంచ కప్​ క్వాలిఫైయర్స్​ అప్డేట్స్

World Cup Qualifiers 2023 : భారత్​ వేదికగా జరగనున్న వరల్డ్​ కప్​ 2023కు శ్రీలంక జట్టు ఆర్హత సాధించింది. ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్​లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్​లో జింబాబ్వేను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

Sri Lanka beat Zimbabwe
Sri Lanka beat Zimbabwe

By

Published : Jul 2, 2023, 7:29 PM IST

Updated : Jul 2, 2023, 8:45 PM IST

Sri Lanka Vs Zimbabwe : భారత్​ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్​ కప్​ 2023కు శ్రీలంక జట్టు అర్హత సాధించింది. ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్స్ సూపర్​ సిక్సెస్​​ స్టేజ్​లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. దీంతో 8 పాయింట్లు సాధించిన శ్రీలంక.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వరల్డ్​ కప్​నకు నేరుగా అర్హత సాధించి.. వరల్డ్​ కప్​లో 9వ జట్టుగా అడుగుపెట్టింది. మరోవైపు, వరల్డ్​ కప్​ రేసు నుంచి జింబాబ్వే నిష్క్రమించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్​కు దిగిన జింబాబ్వే జట్టు.. 32.2 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సీన్ విలియమ్స్‌..57 బంతుల్లో 56 స్కోర్​ చేసి మైదానంలో చెలరేగిపోయాడు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ 4 వికెట్లతో రాణించగా.. మదుషంక 3 వికెట్లు, పతిరణ 2 వికెట్లు సాధించి టీమ్​కు గెలుపును అందించడంలో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 33.1 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి అనుకున్న స్కోర్​ను ఛేదించి అనూహ్య విజయాన్ని సాధించింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ నిస్సంక(101) అజేయ శతకంతో చెలరేగగా.. అతడితో పాటు కరుణరత్నే(30) కూడా ఈ మ్యాచ్​లో రాణించాడు.

ICC World Cup 2023 Schedule : అక్టోబర్‌ 5వ తేదీ నుంచి వరల్డ్ కప్​ మ్యాచ్​లు ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. 46 రోజుల పాటు ఈ టోర్నీలో మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే 8 జట్లు నేరుగా టోర్నీకి అర్హత సాధించాయి. తాజాగా 9వ టీమ్​గా అర్హత సాధించింది. లీగ్‌ దశలో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో రౌండ్‌ బిన్‌ పద్ధతిలో ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో సెమీఫైనల్స్‌కు పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు అర్హత సాధిస్తాయి.

Icc world Cup Schedule : అక్టోబర్‌ 8న అస్ట్రేలియాతో భారత్‌.. చెన్నై వేదికగా తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇక అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న భారత్‌-పాక్​తో తలపడనుంది. మరోవైపు లీగ్‌ దశలో టీమ్‌ఇండియా మొత్తం 8 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగ్గా.. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉండనుంది. హైదరాబాద్‌ వేదికగా 3 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Last Updated : Jul 2, 2023, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details