2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్(2007 world cup final)లో మిస్బాల్ ఉల్ హక్ క్యాచ్(misbah ul haq career) గురించి అసలు అలోచించలేదని టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్(sreesanth t20 world cup) తాజాగా వెల్లడించాడు. అప్పుడు ఫైనల్స్‌లో భారత్.. మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన ట్రోఫీ ముద్దాడింది. అది జరిగి శుక్రవారం నాటికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాటి చిరస్మరణీయ క్యాచ్ అందుకున్న శ్రీశాంత్(sreesanth t20 world cup) తాజాగా ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పాడు. అప్పుడు తాను క్యాచ్ గురించి ఆలోచించలేదన్నాడు.
"జోగిందర్ చివరి ఓవర్ బౌలింగ్ చేసేటప్పుడు తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. రెండో బంతిని మిస్బా సిక్స్‌గా మలిచాడు. దీంతో మాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో నా వద్దకు బంతి వస్తే పాకిస్థాన్‌కు సింగిల్ మాత్రమే ఇవ్వాలని రెండో పరుగు ఇవ్వకూడదని అనుకున్నా. అప్పుడసలు క్యాచ్ గురించే ఆలోచించలేదు. చివరికి మిస్బా(misbah ul haq career) ఆడిన మూడో బంతి గాల్లోకి పైకి వెళ్లగా నేను రెండు మూడు అడుగులు వెనక్కి వెళ్లా.. దీంతో బంతి నేరుగా వచ్చి నా చేతుల్లో పడింది. అయితే, అప్పుడా బంతి చేజారినట్లు అనిపించినా రెండోసారి గట్టిగా ఒడిసిపట్టా" అని శ్రీశాంత్(sreesanth t20 world cup) వివరించాడు.