టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పగానే ఎవరికైనా ఏం గుర్తుకు వస్తుంది. అతడి ధనాధన్ బ్యాటింగ్, మైదానంలో కూల్ కెప్టెన్సీ, వికెట్ల వెనక చురుకైన కీపింగ్.. చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన మహీ.. కుటుంబానికీ చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. సామాజిక మాధ్యమాల్లో ధోనీ దంపతులు షేర్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం. అవేంటో మీరూ చూడండి.
ఆ ముగ్గురు..
తల్లి, తండ్రి, కూతురు మధ్య బంధమనేది చాలా ప్రత్యేకమైంది. ధోనీతో తన కూతురు జీవా, సాక్షి ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది సాక్షి. ఇది వారి 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
టీజ్ చేస్తూ..
అదే పోస్ట్‌లో మరో ఫొటోను సాక్షి షేర్ చేసింది. ఇందులో మహీని ఆటపట్టిస్తూ కనిపించింది సాక్షి. ఈ చిత్రం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనంగా ఉంది.
జంటగా..
జంటగా ఉండటమంటే జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను కలిసి ఎదుర్కోవడం. ఆటగాడిగా తన కుటుంబంతో తగిన సమయం గడపని మహీ.. రిటైర్మెంట్ అనంతరం భార్య, కూతురుతో విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాడు. వీరిద్దరూ జంటగా దిగిన ఓ చిత్రం వారి అనుబంధానికి గుర్తుగా నిలుస్తోంది.
ప్రేమ నుంచి పెళ్లి వరకు..
పెళ్లి కానంత వరకు కూడా ధోనీ-సాక్షి జంట మధ్య ప్రేమాయణం సాగిందని చాలా మందికి తెలియదు. అందుకే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యాక అభిమానులు ఆశ్చర్యపోయారు. జులై 4తో వీరి అనుబంధానికి 12 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే భర్తగా, తండ్రిగా.. తానెంటో నిరూపించుకున్నాడు మహీ. ఈ జోడీ ప్రేమాయణం సాగించిన రోజుల నుంచి మొన్నటి షిమ్లా టూర్ వరకు దిగిన ఫొటోలు మీ కోసం.
కలిసికట్టుగా..