kidambi srikanth news: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కియాన్ యో(సింగపూర్) చేతిలో 15-21, 20-22 తేడాతో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.
శనివారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో శ్రీకాంత్ 17-21, 21-14, 21-17తో లక్ష్యసేన్‌పై విజయం సాధించి ఫైనల్ చేరాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్‌లో అకానె యమగూచి (జపాన్) స్వర్ణం సాధించింది. ఒకటో సీడ్ తైజు యింగ్ (చైనీస్ తైపీ)పై 21-14,21-11తో విజయాన్ని చేజిక్కించుకుంది. ప్రపంచ మూడో సీడ్ యమగుచి బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్స్ టైటిల్‌ని నెగ్గిన జపాన్ రెండో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది.