తెలంగాణ

telangana

ETV Bharat / sports

AP GOVERNMENT: పీవీ సింధుకు రూ.30 లక్షల నగదు బహుమతి - prize money to Olympics‌ winners at ap

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్యం పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకు నగదు బహుమానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2017–22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన విజేతలకు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపిన ఏపీ సీఎం జగన్​.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

AP GOVERNMENT
టోక్యో ఒలింపిక్స్‌

By

Published : Aug 3, 2021, 7:30 AM IST

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో కాంస్యం సాధించిన పీవీ సింధుకు నగదు బహుమానం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. 2017–22 స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ. 75 లక్షలు, రజత పతక విజేతలకు రూ. 50 లక్షలు, కాంస్య సాధించిన వారికి రూ. 30 లక్షల ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు.

పీవీ సింధుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో రెండు ఎకరాల స్థలాన్ని అకాడమీ కోసం కేటాయించిందని గుర్తు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌ వెళ్లే ముందు సింధుతో పాటు రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సాత్విక్, హాకీ క్రీడాకారిణి రజనిలకు రూ. 5 లక్షల చొప్పున నగదు సహాయం చేశామని తెలిపారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న జగన్.. 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ క్రీడల్లో ప్రతిభ చూపిన వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details