తెలంగాణ

telangana

ETV Bharat / sports

17నెలల నిరీక్షణకు తెర- ఫైనల్​కు కిదాంబి - final

భారత షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ ఇండియా ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో చైనా ఆటగాడు హుయాంగ్​ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు.

కిదాంబి శ్రీకాంత్

By

Published : Mar 30, 2019, 5:45 PM IST

భారత బ్యాడ్మింటన్​ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ 17 నెలల నిరీక్షణకు తెరపడింది. ఇండియా ఓపెన్ ఫైనల్లోకి ఈ తెలుగుతేజం అడుగుపెట్టాడు. శనివారం జరిగిన సెమీస్​లో చైనాకు చెందిన హుయాంగ్​ను 14-21, 21-16, 21-19 తేడాతో ఓడించాడు. విక్టర్​ అక్సెల్సన్​- పారుపల్లి కశ్యప్​ల మధ్య జరిగే మరో సెమీస్​ విజేతతో తుదిపోరులో తలపడనున్నాడు శ్రీకాంత్.

"నేను ఫైనల్​ ఆడి చాలా రోజులైంది. ప్రస్తుతం తుదిపోరుకు వెళ్లడం ఆనందంగా ఉంది. మొదటి సెట్​ ఓడిపోయినప్పటికీ రెండో సెట్ నుంచి పుంజుకున్నాను"
--కిదాంబి శ్రీకాంత్, భారత షట్లర్​

శ్రీకాంత్ చివరగా 2017 అక్టోబర్​లో ఫ్రెంచ్ ఓపెన్​ ఫైనల్​ ఆడాడు. ఆ ట్రోఫీ నెగ్గిన తర్వాత ఇప్పుడే ఫైనల్లో ప్రవేశించాడు. గతేడాది కామన్​వెల్త్ గేమ్స్​లో తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) నిర్వహించే సూపర్​ సిరీస్​లలో.. ఫైనల్​ చేరడం 17 నెలల తర్వాత ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details