ఫ్రెంచ్, చైనా ఓపెన్‌లో ఆరంభంలోనే ఇంటిముఖం పట్టిన పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్‌లో సత్తా చాటింది. మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో కొరియాకు చెందిన 'కిమ్ గా యున్'ను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది.
బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్‌పై 21-15, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సింధు. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. రెండు సెట్లల్లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించి గేమ్‌ను సొంతం చేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో చైనాకు చెందిన హువాంగ్ యు జియాంగ్‌పై ప్రణయ్ విజయం సాధించాడు. 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలుపొందాడు. 44 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి రెండో రౌండ్‌కు చేరాడు. రెండు సెట్లలోనూ మెరుగ్గా రాణించాడు ప్రణయ్.
ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. చైనాకు చెందిన కై చేతిలో సైనా పరాజయం చెందగా.. చైనీస్ తైపీ ప్లేయర్ వాంగ్‌పై సమీర్ ఓడాడు.
ఇదీ చదవండి: రోహిత్‌శర్మ '264' మైలురాయికి ఐదేళ్లు