ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. తెలుగుతేజం పీవీ సింధు, సమీర్ వర్మ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. సింధు ఇండోనేషియా క్రీడాకారిణీ ఛోయిరున్నిసాపై గెలుపొందగా.. సమీర్ మలేషియా ఆటగాడు లీ జీ పై విజయం సాధించాడు.
21-14, 21-9 తేడాతో వరుస సెట్లలో ఇండోనేషియా ఛోయిరున్నిసాను చిత్తుచేసింది సింధు. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్ ఆరంభం నుంచి సింధునే పైచేయి సాధించింది.