తెలంగాణ

telangana

ETV Bharat / sports

హాంకాంగ్​ ఓపెన్​: 'స్టార్'​ షట్లర్లు పతకాలు తెచ్చేనా..?

మంగళవారం నుంచి హాంకాంగ్​ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం కానుంది. పతకాలు సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నారు భారత షట్లర్లు.

హాంకాంగ్​ ఓపెన్​ బరిలో భారత షట్లర్లు

By

Published : Nov 12, 2019, 5:31 AM IST

Updated : Nov 12, 2019, 7:22 AM IST

భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ఇటీవలే చైనా ఓపెన్​లో సత్తా చాటారు. సెమీఫైనల్లో పోరాడి ఓడారు. మంగళవారం ప్రారంభమయ్యే హాంకాంగ్ ఓపెన్​లో మాత్రం ఈ తప్పు పునరావృతం కాకూడదని భావిస్తున్నారు.

సాత్విక్-చిరాగ్.. పతకం సాధించాలనే పట్టుదలతో ఈ టోర్నీ బరిలో దిగుతున్నారు. తొలి రౌండ్​లో జపాన్ ద్వయం టకూరో హోకి-యుగో కొబయాషీతో తలపడనున్నారు.

వీరితో పాటే మహిళల సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు.. బరిలో దిగుతున్నారు. గత కొన్ని టోర్నీల్లో వీరు పతకాలు సాధించడంలో విఫలమయ్యారు. చైనా ఓపెన్​లో వీరిద్దరూ తొలి రౌండ్​లోనే నిష్క్రమించారు.

ఈ టోర్నీ తొలిరౌండ్​లో సైనా.. చైనాకు చెందిన కాయ్ యన్ యన్​తో, సింధు కొరియాకు చెందిన కిమ్ గ యోన్​తో తలపడనున్నారు.

పురుషులు సింగిల్స్ విభాగంలో కిదాంబీ శ్రీకాంత్.. ప్రపంచ నంబర్ వన్ షట్లర్​ కెంటో మొమొటోతో తొలి రౌండ్​ ఆడనున్నాడు. సాయి ప్రణీత్.. షై యు కీ(చైనా)తో తలపడనున్నాడు.

మహిళల డబుల్స్​ విభాగంలో అశ్విని-సిక్కిరెడ్డి, మిక్స్​డ్ డబుల్స్ విభాగంలో సాత్విక్-అశ్విని పొన్నప్ప జోడీలు బరిలోకి దిగుతున్నాయి.

Last Updated : Nov 12, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details