స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్లకు శుక్రవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
ఒలింపిక్ విజేత పీవీ సింధు.. క్వార్టర్స్‌లో 21-16, 23-21 తేడాతో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్‌పై వరుస సెట్లలో గెలిచింది. సెమీఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి మియాతో తలపడనుంది.
ప్రణీత్, జయ్రామ్కు నిరాశ..
సింధు తప్ప మిగతా వారంతా నిరాశపరిచారు.
మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్- అశ్విని పొన్నప్ప ద్వయం ఓడింది. మలేసియా జోడీ టాన్ కియాన్ మెంగ్, లై పే జింగ్ చేతిలో 17-21, 21-16, 18-21 తేడాతో పరాజయం పాలయ్యారు.
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో గతేడాది రన్నరప్ సాయి ప్రణీత్ కూడా వరుస సెట్లలో చిత్తయ్యాడు. మలేసియా షట్లర్ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓడిపోయాడు.
మరో సింగిల్స్ ఆటగాడు.. అజయ్ జయరామ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. థాయ్ షట్లర్.. 21-9, 21-6 తేడాతో అజయ్‌ని ఓడించాడు.
ఇదీ చదవండి:స్విస్ ఓపెన్: సైనా, కశ్యప్ నిష్క్రమణ