తెలంగాణ

telangana

ETV Bharat / sports

212 ర్యాంక్ క్రీడాకారిణి చేతిలో ఓడిన సైనా - saina neehwal

భారత స్టార్ షట్లర్ సైనా న్యూజిలాండ్ ఓపెన్​లో ఓడిపోయింది. చైనాకు చెందిన వాంగ్​ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్​లో భారత జోడి మను అత్రి- సుమిత్ రెడ్డి న్యూజిలాండ్​ ద్వయంపై విజయం సాధించారు.

సైనా

By

Published : May 1, 2019, 4:16 PM IST

న్యూజిలాండ్ ఓపెన్​లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్​లోనే ఇంటి ముఖం పట్టింది. చైనాకు చెందిన వాంగ్ జీ చేతిలో ఓడిపోయింది. 16-21, 23-21, 4-21 తేడాతో పరాజయం చెందింది. ప్రపంచ 212 ర్యాంకులో ఉన్న వాంగ్... 9వ ర్యాంకులో ఉన్న సైనా నెహ్వాల్​ను ఓడించింది.

గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఆటలో ప్రత్యర్థి సైనాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్​లో 0-4 తేడాతో వెనుకబడిన సైనా వెంటనే పుంజుకున్నా.. ఫలితం లేకపోయింది. 16-21 తేడాతో 19 ఏళ్ల వాంగ్ భారత షట్లర్​ను ఓడించింది. రెండో గేమ్​లో సైనా 23-21 తేడాతో గెలవగా... మూడో సెట్​లో వాంగ్​కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

పురుషుల సింగిల్స్​లో లక్ష్యసేన్.. తైవాన్ ఆటగాడు జూ వీ చేతిలో పరాజయం చెందాడు. 21-15, 18-21, 10-21 తేడాతో తీవ్రంగా శ్రమించినా విజయం దక్కించులేకపోయాడు. పురుషుల డబుల్స్​లో మనుఅత్రి - సుమిత్ రెడ్డి జోడి న్యూజిలాండ్ ద్వయం జోషువా - జాక్​ను 21-17, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడించారు.

ఇది చదవండి: ఐపీఎల్​కు వరుణ్ చక్రవర్తి దూరం

ABOUT THE AUTHOR

...view details