తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్ బెస్ట్ ర్యాంకులో ప్రణీత్.. సింధు నెంబర్ 6 - bwf rankings

ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్​లో సాయి ప్రణీత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్​(11వ) కైవసం చేసుకున్నాడు. పీవీ సింధు ఆరో స్థానంలో కొనసాగుతోంది.

బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్

By

Published : Oct 23, 2019, 9:37 AM IST

Updated : Oct 23, 2019, 11:51 AM IST

బ్యాడ్మింటన్ తాజా ర్యాంకింగ్స్​లో భారత షట్లర్లు మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్ ఓ స్థానం మెరుగుపరుచుకొని కెరీర్​ బెస్ట్​ 11వ ర్యాంకులో నిలిచాడు. మహిళల సింగిల్స్​ విభాగంలో పీవీ సింధు ఆరో స్థానంలో కొనసాగుతోంది.

మరో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఒక స్థానం చేజార్చుకుని 10వ ర్యాంకులో నిలిచాడు. సమీర్ వర్మ కూడా ఓ స్థానం కోల్పోయి 18వ స్థానానికి చేరాడు. పురుషుల జాబితాలో కెంటో మెమోటా(జపాన్) అగ్రస్థానంలో ఉన్నాడు.

భారత్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓ ర్యాంకు పడిపోయి 9వ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో తైజు యింగ్(చైనీస్) అగ్రస్థానంలో ఉంది.

ఆగస్టులో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్ ఇప్పటివరకు 12వ స్థానంలో ఉన్నాడు. ఆ టోర్నీలో ఒలింపిక్ ఛాంపియన్​ కెంటో మెమోటాను ఓడించి సత్తాచాటాడు.

ఇదీ చదవండి: ఫ్రెంచ్ ఓపెన్​లో సింధు శుభారంభం

Last Updated : Oct 23, 2019, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details