తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇది ఆరంభమే... ఇకపై అంతకుమించి' - badminton

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ పురుషుల విభాగంలో 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించి పతకం తెచ్చిన ఆటగాడు సాయి ప్రణీత్​. ఈ తెలుగుతేజం సెమీస్​లో పోరాడి ఓడినా కాంస్యంతో దేశ గౌరవాన్ని పతాకస్థాయికి చేర్చాడు. ఈ విజయం అనంతరం సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చిన అతడిని ఈటీవీ భారత్ పలకరించింది.

'ఇది ఆరంభమే... ఇకపై అంతకుమించి'

By

Published : Aug 27, 2019, 9:04 PM IST

Updated : Sep 28, 2019, 12:37 PM IST

ఇంటర్వూలో మాట్లాడుతున్న సాయిప్రణీత్​

ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ పురుషుల విభాగంలో... 36 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించి పతకం తెచ్చాడు సాయి ప్రణీత్​. సెమీస్​లో పోరాడి ఓడినా కాంస్యంతో దేశ గౌరవాన్ని పతాకస్థాయికి చేర్చాడీ తెలుగు క్రీడాకారుడు. 1983లో పురుషుల సింగిల్స్​ విభాగంలో ప్రకాశ్​ పదుకొనె కాంస్యం తెచ్చాడు. అతడి తర్వాత మరోసారి దేశానికి మెడల్​ తెచ్చిన యువ క్రీడాకారుడు ప్రణీత్​. స్విట్జర్లాండ్​లోని బాసెల్​ వేదికగా జరిగిన టోర్నీ తర్వాత విజయదరహాసంతో రాష్ట్రానికి వచ్చిన అతడిని ఈటీవీ భారత్ పలకరించింది.

ఇటీవల ప్రభుత్వం అతడికి అర్జున అవార్డు ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని భారత దిగ్గజ ఆటగాడు ధ్యాన్​చంద్​ పుట్టినరోజు(ఆగస్టు 29)న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నాడు. అయితే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో విజయంపై మాట్లాడిన ప్రణీత్​... ఈ ప్రదర్శన భారత పురుష క్రీడాకారుల విజయాలకు ప్రారంభం మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి అంతర్జాతీయ వేదికలపై దీటైన ప్రదర్శనలు తప్పవని హెచ్చరించాడు. సెమీస్​లో టాప్​ సీడ్​ మొమొటా మైండ్​ గేమ్​ ఆడాడని వెల్లడించాడు. కచ్చితంగా ఈ కాంస్య పతకం మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తుందన్నాడు.

Last Updated : Sep 28, 2019, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details