కరోనాపై పోరాటానికి బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ రూ.4 లక్షలు విరాళమిచ్చాడు. రూ.3 లక్షలు ప్రధాన మంత్రి సహాయనిధికి, రూ.1 లక్ష తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తున్నట్లు తెలిపాడు.
సాయి ప్రణీత్ విరాళం నాలుగు లక్షలు
కరోనా బాధితులను ఆదుకునేందుకు క్రీడాకారులు ముందుకొస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ 4 లక్షలు విరాళమిచ్చాడు.
సాయి
"కొవిడ్-19పై పోరాటంలో నా వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.3 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1 లక్ష విరాళంగా అందించా. ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో నా సాయం దేశానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నా" అని ప్రణీత్ ట్వీట్ చేశాడు.