తెలంగాణ

telangana

ETV Bharat / sports

పీవీ సింధుకు ప్రపంచస్థాయిలో అరుదైన గౌరవం - పీవీ సింధు న్యూస్​

PV Sindhu News: దిగ్గజ షట్లర్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్​ కమిషన్ సభ్యురాలిగా సింధు ఎంపికైంది.

PV Sindhu News
పీవీ సింధు

By

Published : Dec 20, 2021, 6:55 PM IST

PV Sindhu News: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్​ కమిషన్ సభ్యురాలిగా దిగ్గజ షట్లర్ పీవీ సింధు సోమవారం ఎంపికైంది. బీడబ్ల్యూఎఫ్​ అథ్లెట్ కమిషన్​ 2021-2025కి ఆరుగురు సభ్యులను ప్రకటించింది. అందులో సింధు ఒకరు. ఈ ఐదుగురు సభ్యులతో కలిసి 2025 వరకు సింధు సేవలు అందించనుంది.

ఐరిస్ వాంగ్ (యూఎస్​ఏ), రాబిన్ టాబెలింగ్ (నెదర్లాండ్​), గ్రేసియా పోలి (ఇండోనేషియా), కిమ్ సోయోంగ్ (సౌత్​కొరియా), పీవీ సింధు (ఇండియా), జెంగ్ సి వీ (చైనా)లను బీడబ్ల్యూఎఫ్​ నియమించింది. ఆరుగురు సభ్యులలోనే ఛైర్మన్​, డిప్యూటీ ఛైర్మన్​ను నిర్ణయిస్తారు.

BWF World Championships: 2016లో రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు.. టోక్యో గేమ్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్యాలు, రెండు రజతాలతో పటు ప్రతిష్టాత్మకమైన స్వర్ణాన్ని గెలుచుకుంది.

ఇదీ చదవండి:

కిదాంబి శ్రీకాంత్​కు మోదీ సహా పలువురి ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details