తెలంగాణ

telangana

ETV Bharat / sports

PV Sindhu: ప్రీక్వార్టర్స్​కు సింధు.. లక్ష్యసేన్ ముందంజ - bwf badminton

BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో భారత స్టార్​ షట్లర్ పీవీ సింధు జోరు చూపిస్తోంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్​లో వరుస సెట్స్​లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి ప్రీక్వార్టర్స్​కు చేరుకుంది.

pv sindhu
pv sindhu

By

Published : Dec 14, 2021, 5:24 PM IST

BWF World Championships: బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ను వరల్డ్​ ఛాంపియన్​ పీవీ సింధు ఘనంగా ఆరంభించింది. స్పెయిన్​లో మంగళవారం జరిగిన రెండో రౌండ్​ మ్యాచ్​లో స్లొవేకియాకు చెందిన మార్టినా రెపిస్కాపై విజయం సాధించింది. కేవలం 24 నిమిషాల్లోనే 21-7, 21-9 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. దీంతో ప్రీక్వార్టర్స్​లోకి ప్రవేశించింది.

పీవీ సింధు

పురుషుల సింగిల్స్​లో తర్వాతి రౌండ్​ చేరుకోవడానికి చెమటోడ్చాడు యువ షట్లర్ లక్ష్య సేన్. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో తొలిసారి ఆడుతున్న ఈ షట్లర్.. జపాన్​కు చెందిన కెంటా నిషిమోటోపై 22-20, 15-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన పురుషుల డబుల్స్​లో చైనీస్ తైపీ జోడీ ఝేహుయ్​-యాంగ్​పోపై గెలుపొందింది చిరాగ్​ శెట్టి, సాత్విక్​ సాయిరాజ్​ ద్వయం.

ఇదీ చూడండి:HS Prannoy BWF: ప్రణయ్‌ సంచలన విజయం

ABOUT THE AUTHOR

...view details