ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి గెలవాలని కోరుకుంటున్న భారత క్రీడాకారులకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. కానీ తొలిసారి ఆ కలను నెరవేర్చి టైటిల్ను ముద్దాడింది తెలుగుతేజం పీవీ సింధు. అయితే తన విజయం వెనుక ఓ విదేశీ శిక్షకురాలి సాయం కూడా ఉందంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించింది.
" ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడంలో నాకు ఎంతో సహాయం చేసింది దక్షిణ కొరియా మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కిమ్ జి యున్. ప్రస్తుతం ఆమె నాకు సహాయ కోచ్గా ఉంది. కిమ్ సూచనలతోనే నా ఆట మరింత మెరుగైంది. కొన్ని నెలలుగా ఆమె భారత్‌లోనే ఉంటోంది. నా ఆటను గమనించి కొన్ని సూచనలు చేసింది. వాటిపై బాగా కసరత్తులు చేయించింది. అవే ఛాంపియన్‌షిప్‌లో నాకు బాగా ఉపయోగపడ్డాయి ".
- పీవీ సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి