ఇప్పటికే డబ్ల్యూటీఫ్ నాకౌట్‌కు దూరమైన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. మరో ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగాడు. శుక్రవారం జరిగిన గ్రూప్ దశ మూడో మ్యాచ్‌లో 21-12, 18-21, 19-21 తేడాతో హాంగ్‌కాంగ్‌కు చెందిన లాంగ్ ఆంగస్ చేతిలో ఓటమి చెందాడు.
గంటకు పైగా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్లో సునాయాసంగానే నెగ్గాడు శ్రీకాంత్. అయితే అనూహ్యంగా ఆంగస్ పుంజుకోవడం, శ్రీకాంత్ తన ఫామ్ కొనసాగించకపోవడం వల్ల అతడికి ఓటమి తప్పలేదు.