తెలంగాణ

telangana

ETV Bharat / sports

జాతీయ బ్యాడ్మింటన్​ శిబిరానికి గ్రీన్​సిగ్నల్​

జాతీయ బ్యాడ్మింటన్​ శిక్షణా శిబిరాన్ని హైదరాబాద్​లో సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. గోపీచంద్ అకాడమీకి చేరే ముందు కొవిడ్​ పరీక్షలు చేయించుకుని అందులో నెగెటివ్​ తేలితేనే శిక్షణకు అనుమతి లభిస్తుందని అధికారులు తెలిపారు.

National badminton camp to be held in Hyderabad from September 7
జాతీయ బ్యాడ్మింటన్​ శిబిరానికి గ్రీన్​సిగ్నల్​

By

Published : Sep 7, 2020, 8:01 AM IST

Updated : Sep 7, 2020, 8:10 AM IST

హైదరాబాద్​లోని సాయ్​-పుల్లెల గోపీచంద్​ అకాడమీలో సోమవారం నుంచి జాతీయ బ్యాడ్మింటన్​ శిక్షణ శిబిరం కొనసాగనుంది. కొంతమంది షట్లర్లకు కరోనా సోకడం వల్ల తాత్కాలికంగా నిలిచిపోయిన శిక్షణను పునఃప్రారంభించనున్నారు. అక్టోబర్​ 3న డెన్మార్క్​ వేదికగా థామస్​, ఉబర్​ కప్​ ఆరంభం కానుంది.

దీని కోసం సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​, కశ్యప్​, లక్ష్యసేన్​, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్పలతో పాటు ఏడుగురు కోచ్​లు, నలుగురు సహాయక సిబ్బంది అకాడమీకి రానున్నారు. హైదరాబాద్​కు చేరే ముందు వీళ్లందరికి కోవిడ్​ పరీక్ష చేస్తారు. నెగెటివ్​ వస్తేనే అకాడమీలోకి ప్రవేశం లభిస్తుంది. తర్వాత ఆరు రోజుల స్వీయ నిర్బంధం, ఆపై మరోసారి పరీక్ష చేశాక శిబిరానికి పంపిస్తారు.

Last Updated : Sep 7, 2020, 8:10 AM IST

ABOUT THE AUTHOR

...view details