తైపీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ డెఫ్ యూత్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మధురై బాలిక సత్తాచాటింది. 16 ఏళ్ల జెర్లిన్ అనికా ఓ స్వర్ణంతో పాటు రెండు రజతాలు తన ఖాతాలో వేసుకుంది. సింగిల్స్ విభాగంలో జర్మనీకి చెందిన ఫినిజాపై పసిడి గెలిచింది. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రెండు వెండి పతకాలు సొంతం చేసుకుంది.
27 దేశాలకుపైగా పాల్గొన్న ఈ టోర్నమెంట్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. జులై 11 మొదలైన ఈ పోటీలు 22 వరకు జరగనున్నాయి.