థాయ్‌లాండ్ మాస్టర్స్‌లో మంచి ప్రదర్శన చేసి ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలనుకున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే మిగిలింది. షెసర్ హిరెన్(ఇండోనేషియా) చేతిలో ఓడి, తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 48 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్‌లో రెండో సీడ్ శ్రీకాంత్.. 21-12, 14-21, 12-21 తేడాతో ఓడిపోయాడు.
కిదాంబి శ్రీకాంత్.. తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ - pv sindhu
భారత్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్.. థాయ్‌లాండ్ మాస్టర్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. సమీర్ వర్మ కూడా ఇంటిముఖం పట్టాడు.
కిదాంబి శ్రీకాంత్
ఆధిపత్యం చెలాయించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా, తర్వాత గేముల్లో కిదాంబి తేలిపోయాడు. తొలి రౌండ్‌లోనే అతడు టోర్నీల నుంచి నిష్క్రమించడం వరుసగా ఇది మూడో సారి. మరో భారత షట్లర్ సమీర్‌వర్మ కూడా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. లీ జి జియా (మలేసియా) చేతిలో 16-21, 15-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.
Last Updated : Feb 17, 2020, 11:48 PM IST