తెలంగాణ

telangana

ETV Bharat / sports

థాయ్​లాండ్ ఓపెన్: సాత్విక్‌, చిరాగ్‌ జోడీ ఓటమి - thailand open satwik

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ నుంచి భారత బ్యాడ్మింటన్ పురుషుల జోడీ సాత్విక్, చిరాక్​ నిష్క్రమించారు. ఇండోనేషియాకు చెందిన మహ్మద్‌ అహ్‌సన్‌, హెంద్ర సెతివాన్‌ ద్వయంతో గురువారం జరిగిన పోరులో 19-21, 17-21 తేడాతో ఓడిపోయారు.

india's top ranked doubles pair satwik sairaj and chirag shetty lost in second round of thailand open
రెండో రౌండ్‌లో ఓడిన సాత్విక్‌, చిరాగ్‌

By

Published : Jan 14, 2021, 12:52 PM IST

Updated : Jan 14, 2021, 3:42 PM IST

యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీ మిక్స్​డ్​ డబుల్స్‌ రెండో రౌండ్‌లో భారత షట్లర్స్​ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇండోనేషియా ఆటగాళ్లు మహ్మద్‌ అహ్‌సన్‌, హెంద్ర సెతివాన్‌తో గురువారం తలపడిన రెండో రౌండ్‌లో 19-21, 17-21 తేడాతో ఓడిపోయారు. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగియగా.. తొలి సెట్‌లో సాత్విక్‌, చిరాగ్‌ కొంత పోటీ ఇచ్చినా తర్వాతి సెట్‌లో పూర్తిగా వెనుకపడిపోయారు. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

అంతకుముందు దక్షిణ కొరియా ఆటగాళ్లు కిమ్‌ గి జంగ్‌, లీ యాంగ్‌తో తొలి రౌండ్‌లో తలపడిన సాత్విక్‌, చిరాగ్‌ జోడి 19-21, 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌ చేజార్చుకొన్నా.. చివరి రెండు సెట్లలో విజయం సాధించారు. దీంతో దక్షిణ కొరియా జోడీపై విజయం సాధించిన భారత ఆటగాళ్లు తర్వాత ఇండోనేషియా జోడీతో ఓటమిపాలయ్యారు.

ఇదీ చూడండి: థాయ్​ ఓపెన్:సైనా ముందడుగు.. మరో ఇద్దరికి పాజిటివ్

Last Updated : Jan 14, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details