తెలంగాణ

telangana

ETV Bharat / sports

సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్​ అర్హతపై సందిగ్ధం - badminton news

భారత షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్​ల ఒలింపిక్స్ ఆశలపై కరోనా గండికొట్టింది! మలేషియా ఓపెన్​లో వీరు పాల్గొనాల్సి ఉంది. కానీ బయట పరిస్థితి ప్రస్తుతం వేరుగా ఉంది. దీంతో వీరిద్దరూ ఆ టోర్నీలో ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Indian shuttlers may not be able to compete in Malaysian Open
సైనా, శ్రీకాంత్

By

Published : Apr 29, 2021, 7:13 AM IST

భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ టోక్యో ఒలింపిక్స్‌ అర్హత అవకాశం సందిగ్ధంలో పడింది. భారత్‌లో కరోనా విజృంభణ దృష్ట్యా ఇక్కడి నుంచి తమ దేశానికి వచ్చే విమానాలపై మలేషియా తాత్కాలిక నిషేధం విధించడమే అందుకు కారణం. దీంతో వచ్చే నెల 25న ఆరంభమయ్యే మలేషియా ఓపెన్‌లో భారత షట్లర్లు పాల్గొనే విషయంపై సందేహాలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో సత్తాచాటి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉన్న సైనా, శ్రీకాంత్‌లపై పెను ప్రభావం పడనుంది.

సైనా నెహ్వాల్

ఒలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌ ప్రక్రియలో ఇదే చివరి ప్రధాన టోర్నీ. మహిళల, పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-16లో ఉన్న షట్లర్లే ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకుంటారు. ప్రస్తుతం సైనా 22వ, శ్రీకాంత్‌ 20వ ర్యాంకులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్‌ నుంచి పీవీ సింధు, సాయి ప్రణీత్‌, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌ జోడీకి మాత్రమే ఆ మెగా క్రీడలకు అర్హత సాధించే ర్యాంకింగ్‌ ఉంది.

ABOUT THE AUTHOR

...view details