ఉగాండాలో పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో((Para Badminton 2021) ) ఆడటానికి వెళ్లిన భారత షట్లర్లకు భయానక అనుభవం ఎదురైంది. కంపాలాలో వారు బస చేసిన హోటల్‌కు సమీపంలోనే మంగళవారం రెండుసార్లు బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా.. చాలామంది క్షతగాత్రులయ్యారు. తమ హోటల్‌కు 100 మీటర్ల దూరంలోనే ఈ విస్ఫోటనాలు సంభవించినట్లు కోచ్ గౌరవ్ ఖన్నా చెప్పాడు.
"హోటల్‌కు వంద మీటర్ల దూరంలోనే పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ దాడులు జరిగినప్పుడు కొంతమంది భారత ఆటగాళ్లు హోటల్‌లో లేరు. అప్పుడు బ్యాడ్మింటన్ హాల్‌కు వెళ్తున్నారు. దాడుల గురించి భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాం" అని గౌరవ్ తెలిపాడు. "మా హోటల్‌లో 15 మంది భారతీయులు ఉన్నారు. మరో హోటల్‌లో ఇంకొందరు బస చేశారు. మేమంతా క్షేమంగా ఉన్నాం. షెడ్యూల్ ప్రకారమే టోర్నీలో ఆడతాం" అని టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన ప్రమోద్ భగత్ చెప్పాడు.