మాజీ ఛాంపియన్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ ఏడాది ఇండియన్ ఓపెన్‌లో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఈ టోర్నీ మార్చి 26 నుంచి 31 వరకు దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. విజేతలకు 2 కోట్ల 41 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ దక్కనుంది.
- సింధు, శ్రీకాంత్‌పై భారీ ఆశలు...
ఇండియన్ ఓపెన్ మహిళల విభాగంలో పీవీ సింధు ఒకసారి(2017) విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో శ్రీకాంత్ 2015లో టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరిపై ఈ ఏడాది కూడా భారీ ఆశలున్నాయి.
- గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సత్తా చాటిన సింధు... ఇటీవల జరిగిన ఇండోనేషియా టోర్నీ, ఆల్ ఇంగ్లండ్ బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో నిరాశపరిచింది.
- ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ విజేత 'యుఫీ చెన్' సహా జపాన్ టాప్ క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనకపోవడం సింధుకు కలిసొచ్చే అంశం.
- సింధుతొలి మ్యాచ్‌లో ముగ్ద ఆగ్రేతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ దనీష్ మియాతో ఆడనుంది. ఈ ఆటలోప్రధానపోటీ సింధు, చైనీస్ క్రీడాకారిణి మూడో సీడ్ బింగ్జియావ్ మధ్యనే ఉండనుంది.
- కిదాంబి శ్రీకాంత్ ఆరంభ మ్యాచ్‌లో హాంకాంగ్ ఆటగాడు వోంగ్ వింగ్‌తో తలపడనున్నాడు.
సైనా నెహ్వాల్ దూరం...